అమ్మాయిలతో కలిసి రవి మందేస్తే... బూతులు, గట్రా!
on Jul 29, 2021
యాంకర్ రవి మందు తాగుతాడా? తాగుతాడని నటుడు, 'బిగ్ బాస్' ఫేమ్ అలీ రెజా అంటున్నాడు. అదీ అమ్మాయిలతో ఉన్నప్పుడు మందు తాగుతాడని చెబుతున్నాడు. జస్ట్ ఫర్ ఫన్ కోసం అన్నట్టు అలీ రెజా చెప్పినా, ప్రజెంట్ అతడు చెప్పిన విధానం ఆడియన్స్ ను అట్ట్రాక్ చేస్తోంది.
'హ్యాపీ డేస్' షోకి రవి, అషురెడ్డి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోకి అలీ రెజా సడన్ ఎంట్రీ ఇచ్చాడు. 'జనరల్ గా రవి అసలు ఎప్పుడూ తప్పు చెయ్యడు కదా' అని అషురెడ్డి అన్నది. అందుకు అలీ రెజా 'మనోడికి అసలు ఎటువంటి అలవాట్లు లేవు' అని చెప్పాడు. అతడి భుజం మీద వాలి సిగ్గుపడ్డాడు రవి. అక్కడితో అలీ రెజా ఆగలేదు.
'అమ్మతోడు చెప్తున్నా... వాడు అస్సలు బూతులు మాట్లాడడు' అని అలీ మళ్లీ మొదలుపెట్టాడు. 'అరే, ఏం మాట్లాడుతున్నావ్ రా' అన్నట్టు రవి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. 'మందు తాగినప్పుడు (బూతులు) మాట్లాడతాడు. అమ్మాయిలతో ఉన్నప్పుడే మందు తాగుతాడు' అని అలీ రెజా చెప్పాడు. షోలో కమెడియన్లు, ఆడియన్స్ ఒక్కసారి ఘొల్లున నవ్వారు. అలీ సరదాగా అన్నట్టు కనిపించినా కొత్తవాళ్లు చూస్తే అమ్మాయిలతో కలిసి రవి మందేస్తే... బూతులు మాట్లాడుతూ ఏదో చేస్తాడని అనుకునే ప్రమాదం ఉంది.
Also Read